Stock Market: ఆర్బీఐ వైపు మార్కెట్ల చూపు.. నష్టాల్లో మెుదలైన సెన్సెక్స్, నిఫ్టీ..
Opening Bell: ఆసియా, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటు నేడు రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లపై ప్రకటన ఉండటంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. మార్కెట్లు ప్రీ-ఓపెనింగ్ లో సైతం సూచీలు నష్టాలను సూచించాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 196 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్లు నష్టంతో ముందుకు సాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 10 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ లాభాల్లో నుంచి 172 పాయింట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడితో సూచీలు మరింతగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ప్రధానంగా ఐటీ షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో సిప్లా, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీపీసీఎల్, ఎల్ టి, గ్రాసిమ్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రస్తుతం ముందుకు సాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications