Market Opening: ఒడిదొడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ నష్టాలు మార్కెట్లను కిందకు లాగుతోంది. ప్రధానంగా మార్కెట్లు ఓలటాలిటీలో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 99 పాయింట్ల నష్టంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 239 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 75 పాయింట్లు లాభంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఆర్తీ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముందుకు సాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, నెస్లే, సిప్లా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, మారుతీ, టాటా కన్జూమర్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications