Stock Market: ఒడిదొడుకులతో నష్టాల ప్రారంభం.. అమెరికా ఆసియా మార్కెట్ల ప్రభావంతో..
Opening Bell: నిన్న నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ఉదయం కూడా అదే ధోరణిని కొనసాగించాయి. యూఎస్ మార్కెట్ల నష్టాలు, ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్ ప్రభావంతో ముందుకు సాగుతోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 121 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 170 పాయింట్ల నష్టాల్లో ముందుకు సాగుతున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం మార్కెట్లలో ఒత్తిడిని భారీగా పెంచుతోంది.

ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, యూపీఎల్, టాటా మోటార్స్, ఐటీసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications