Stock Market: మోదీ-బాబు జతకట్టడంతో రెచ్చిపోతున్న సెన్సెక్స్-నిఫ్టీ.. జోరుమీదున్న బుల్స్
Market Opening: ఎన్డీయేతో తాము స్థిరంగా కొనసాగుతామని చంద్రబాబు తేల్చి చెప్పటంతో నిన్న ఎన్ఎస్ఈలో భారీగా క్రయవిక్రయాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ స్థాయిలో నిన్న ఒక్కరోజే ఎక్స్ఛేంజీల్లో గరిష్ఠంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
అయితే మార్కెట్లలో మోదీ గెలుపు మళ్లీ ప్రధానిగా కొనసాగటానికి తెలుగుదేశం పార్టీ సహకారం మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా బీజేపీకి తమ లెటర్ ఆఫ్ సపోర్ట్ అందించారు. ఉదయం 9.29 గంటల సమయంలో సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 249 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1024 పాయింట్లు లాభంతో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ లైఫ్, విప్రో, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, నెస్లే, హిందాల్కొ, సిప్లా, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ బ్యాంక్, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications