Stock Market: సార్వత్రిక ఎన్నికల మే సెలవులో ఉండనున్న NSE, BSE.. పూర్తి వివరాలివే..
Market Holiday: దేశంలో మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు సైతం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల సందర్భంగా ఒకరోజు పాటు మార్కెట్లు మూతపడనున్నాయి.
వివరాల్లోకి వెళితే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(NSE) ఏప్రిల్ 8న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ కారణంగా ముంబైలో మే 20 ట్రేడింగ్ సెలవుదినంగా ప్రకటించింది. ముంబైలో పార్లమెంటరీ ఎన్నికల కారణంగా 2024 మే 20వ తేదీని సోమవారం ట్రేడింగ్ సెలవు దినంగా ఎక్స్ఛేంజ్ తాజా సర్క్యులర్ లో పేర్కొంది. సభ్యులు దీనిని గమనించవలసిందిగా అభ్యర్థించబడింది. 2014, 2019 ఎన్నికల సమయంలో కూడా BSE, NSE ట్రేడింగ్ సెలవును ప్రకటించాయి. ఆ సంవత్సరాల్లో ఓటింగ్ రోజులలో ఫారెక్స్, మనీ మార్కెట్లు కూడా మూసివేయబడ్డాయి.

వాస్తవానికి మెుత్తం 5 దశలుగా ఈ సారి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో దశలవారీగా మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికారణంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ఇవ్వాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ మెచ్యూరిటీ తేదీని మే 20కి బదులుగా మే 17గా ప్రకటించింది.
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. ధులే, దిండోరి, నాసిక్, భివాండి, కళ్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, మరియు పాల్ఘర్ లోక్ సభ స్థానాలకు మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ కారణంగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడింగ్ ను ఎన్నికల వేళ నిలిపివేయాలని నిర్ణయించాయి.
ఇదే క్రమంలో ఎన్నికల లోపు స్టాక్ మార్కెట్ల సెలవులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న మార్కెట్ కూడా మూసివేయబడుతుంది. దానికి ముందు ఏప్రిల్ 11న రంజాన్ ఈద్, ఏప్రిల్ 17న రామనవమి కోసం మార్కెట్ కూడా మూసివేయబడుతుంది.


Click it and Unblock the Notifications