Stock Market: మార్కెట్లకు పరీక్షా కాలం.. ఒకపక్క ఐపీవోలు మరోపక్క ఆర్బీఐ మీటింగ్.. ముఖ్య విషయాలు..
Stock Market: వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్లకే కాక అమెరికా మార్కెట్లకు సైతం చాలా కీలకమైనది. ఎందుకంటే భారతీయ రిజర్వు బ్యాంక్ అత్యవసరంగా ముందస్తు ద్రవ్య పరపతి సమావేశాన్ని నిర్వహించటం వల్ల ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. ఇదే క్రమంలో ఫెడ్ సమావేశం కూడా జరుగుతున్నందున అందరి చూపు ఈ రెండింటివైపు ఉంది.

నిఫ్టీ 18000 మార్క్..
బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 17800 స్థాయిని దాటిన తర్వాత భారతీయ ఈక్విటీ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్‌ను చూస్తోంది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ కూడా శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో 41500 స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. అయితే US మార్కెట్ మంచి ఫలితాలు & బలహీనమైన గృహాల అమ్మకాల గణాంకాల తర్వాత బలాన్ని చూపింది.

బంగారం..
నవంబర్ 2న జరగబోయే US FOMC మీటింగ్ ఫలితాలపై అందరూ దృష్టి సారిస్తున్నారు. ఇది గ్రోబల్ మార్కెట్లకు చాలా కీలకమైనది. ఈ కారణంగా బంగారం రేటు పతనం అవుతోంది. ఇదే క్రమంలో 10 సంవత్సరాల యూఎస్ బాండ్స్ రాబడులు సైతం తగ్గుతున్నాయి. ఎఫ్ఐఐలు సైతం ఆచితూచి అడుగువేస్తున్నారు. సంస్థాగత ప్రవాహాలు కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు మారారు.

ఐపీవోల కోలాహం..
మార్కెట్లు వచ్చే వారం ఏకంగా నాలుగు ఐపీవోలతో జోరందుకోనున్నాయి. గ్లోబల్ హెల్త్, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, డీసీఎక్స్ సిస్టమ్స్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఐపీవోలు మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. వీటి మెుత్తం విలువ రూ.4,500 కోట్లుగా ఉంది. 2021లో 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చి ఏకంగా రూ.1.19 లక్షల కోట్ల మూల ధనాన్ని పబ్లిక్ నుంచి సేకరించాయి. అయితే 2022లో మాత్రం స్టాక్ మార్కెట్లలోని ఒడుదొడుకుల కారణంగా ఐపీవో మార్కెట్ బలహీనంగా ఉందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది.

RBI MPC మీటింగ్..
సాధారణంగా రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశాలను ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంటుంది. ఆ సమయంలో వడ్డీ రేట్లపై సమీక్ష చేస్తుంది. కానీ ఇప్పుడు షెడ్యూల్‌లో లేని RBI MPC మీటింగ్ నవంబర్ 3న నిర్వహించటంపై కూడా స్టాక్ మార్కెట్ కన్నేసింది. ఇది నిజంగా మార్కెట్లపై చాలా ప్రభావం చూపనుంది. నిపుణుల అంచనా ప్రకారం మరో సారి వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications