Stock Market: ఏకపక్షంగా ముందుకు సాగుతున్న మార్కెట్లు..!
Market Opening: నిన్న జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నేడు దానిని కొనసాగించే ప్రయాణం చేస్తున్నాయి.ఈ క్రమంలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఐనాక్స్ ఎనర్జీ కంపెనీల షేర్లు ఫోకస్ లో ఉన్నాయి.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 60 పాయింట్లకు పైగా లాభపడి ముందుకు సాగుతోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 197 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 161 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు కీలక బెంచ్ మార్క్ సూచీలు రికార్డు గరిష్ఠాలకు తాకాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, టాటా కన్జూమర్, ఐటీసీ, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications