Stock Market: ప్రధానిగా మోదీ ప్రమాణం.. అయినా ఒడిదొడుకుల్లోనే సెన్సెక్స్, నిఫ్టీ..

Market Opening: ఆదివారం ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం పూర్తైనప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి నేడు ఇన్వెస్టర్లు బుల్ రంకెలు దలాల్ స్ట్రీట్ లో ఉంటాయని భావించారు.

ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత కొద్దిసేపటికి తిరిగి పుంజుకున్నాయి. ఉదయం 9.44 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 44 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 173 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 296 పాయింట్లు పెరుగుదలను నమోదు చేశాయి.

Indian stock markets in volatile amid IT stocks in loses after Modi swearing as PM

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ, నెస్లే, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, ఎల్ టి, ఎయిర్ టెల్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐఎమ్, టైటాన్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగింది. ఉదయం 09:21 గంటల నాటికి, NSE నిఫ్టీ 50 91.90 పాయింట్లు లేదా 0.39% పెరిగి 23,382.05 వద్ద ఉంది మరియు BSE సెన్సెక్స్ 233.11 పాయింట్లు లేదా 0.30% పెరిగి 76,926.47 వద్ద ఉంది. NSE నిఫ్టీ 50 తాజా గరిష్ట స్థాయి 23,411.90కి, సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయి 77,079.04కి చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+