Stock Market: మార్కెట్లను వెంటాడుతున్న బడ్జెట్.. ఒడిదొడుకుల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
Market Opening: నిన్న కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి మెుండి చేయి చూపటంతో పాటు రియల్టీ రంగాన్ని భారీగా దెబ్బతీసే నిర్ణయం తీసుకోవటం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. అయితే నష్టాల్లో మెుదలైన సూచీలు తేరుకుని తిరిగి లాభాల్లోకి వచ్చాయి.
ఈసారి మోదీ ప్రభుత్వం సిగరెట్లపై పన్ను పెంచేందుకు ఎటువంటి ఆలోచన చేయకపోవటం ఐటీసీ లాంటి సిగార్ కంపెనీల షేర్లను లాభాల్లోకి నెట్టేసింది. దీనికి తోడు గోల్డ్-సిల్వర్ పై దిగుమతి సుంకాన్ని 6 శాతానికి పరిమితం చేయటంతో జ్యూవెలరీ వ్యాపారంలో ఉన్న స్టాక్స్ ప్రభానంగా లాభాలను చూస్తున్నాయి. ఇప్పటికే ఐటీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ బలంగా ముందుకు సాగుతున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక సహాయంపై బడ్జెట్ ఫోకస్ పెట్టడం ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లను సానుకూలంగా నేడు ముందుకు నడిపిస్తోంది.

ఈ క్రమంలో ఉదయం 9.40 నిమిషాల సమయంలో సెన్సెక్స్ సూచీ 185 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 60 పాయింట్ల మేర నష్టపోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 230 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 260 పాయింట్లకు పైగా లాభంతో ముందుకు సాగుతోంది. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులతో లాభల నుంచి నష్టాల్లోకి జంప్ చేశాయి. తేరుకున్నట్లే తేరుకుని తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి.
ఎన్ఎస్ఈలో ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో దూసుకుపోతున్నాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications