Market Opening: నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. వాస్తవానికి అమెరికాతో పాటు ఆసియా మార్కెట్ల పతనంతో గిఫ్ట్ నిఫ్టీ సూచీ సైతం ఇదే తరహా సూచనలు మార్కెట్ల ప్రారంభానికి ముందు అందించింది.
ఉదయం 9.19 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 55 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టాన్ని కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 87 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 60 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఓలటాలిటీని ఎదుర్కొంటున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లలో ప్రస్తుతం అంబుజా సిమెంట్స్, నైకా, రైల్ టెల్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో ట్రేడవుతున్నాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, కోల్ ఇండియా, మారుతీ, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఎల్ టి, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications