Bulls Unstoppable: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నికల తర్వాత అన్ స్టాపబుల్ జోష్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో దలాల్ స్ట్రీట్ పూర్తిగా బుల్స్ చేతిలోకి వెళ్లిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూలతలతో పాటు అమెరికా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు దేశీయ మార్కెట్ల ర్యాలీకి ఆజ్యం పోస్తున్నాయి.
ఉదయం లాభాల్లో మెుదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే స్పీడు పెంచి భారీగా పుంజుకున్నాయి. దీంతో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుని 78,000 పాయింట్ల మార్కును అధిగమించింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 23,700 పాయింట్ల మార్కును అధిగమించింది. ఈ క్రమంలో బ్యాంకింగ్ స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీల దౌడును పరిశీలిస్తే.. సెన్సెక్స్ సూచీ ఇంట్రాడేలో గరిష్ఠంగా 78016.04 మార్కును అందుకుంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 23710.45 మార్కుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లలో ధృడమైన ట్రెండ్స్ ట్రాక్ చేయడంతో ఇన్వెస్టర్లు బ్లూచిప్ బ్యాంకుల్లో కొనుగోళ్లు జరిగాయి. అలాగే స్మాల్, మిడ్‌క్యాప్‌లు లాభాల్లో ప్రారంభమైనా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇదే క్రమంలో రంగాల వారీగా రియల్టీ టాప్ లూజర్‌గా కొనసాగుతోంది.
ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే.. చిప్‌మేకర్ ఎన్‌విడియా కంపెనీ షేర్లు నేడు 7% క్షీణతతో యూరోపియన్ స్టాక్‌లు పడిపోయాయి. ఇది అంతకుముందు రోజు US టెక్ కంపెనీలపై ప్రభావం చూపింది. అలాగే ఏఐ రంగం గురించి ఇన్వెస్టర్లలో ఆందోళనలను కలిగించింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు తక్కువ అస్థిరత కలిగిన స్టాక్‌ల వైపు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరువలో ఉన్నాయి. అలాగే సెమీకండక్టర్ స్టాక్స్ నష్టాలకు దారితీయటంతో చైనా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications