Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. అదానీ షేర్ల పరిస్థితి..
Stock Market: నిన్న ఒత్తిళ్లలో ఫ్లాట్ ముగింపును నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రధానంగా నేడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు చాలా ఒత్తిడికి లోనవుతున్నాయ.
ఉదయం 9.24 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. అయితే ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 22 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 98 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సూచీల లాభాలు ఆవిరై ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

అదానీ స్టాక్స్ మారిషస్ పెట్టుబడులపై ఓసీసీఆర్పీ చేసిన ఆరోపణలు దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇదే క్రమంలో దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ జొమాటోలో తన పూర్తి పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడైంది. దీంతో ఈ కంపెనీల షేర్లు మార్కెట్లో ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి.
ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్షియల్స్, హిందాల్కొ, మారుతీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, నెస్లే, బజాజ్ ఆటో, ఎస్బీఐ, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా కన్జూమర్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications