Stock Market: భారీ నష్టాల దిశగా మార్కెట్లు.. అసలు కారణం ఇదే..!!
Markets Fall: ఈవారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు పేలవమైన పనితీరును కనబరుస్తున్నాయి. అంత్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా నేడు సూచీలు నష్టాల బాట పట్టాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 45 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 158 పాయింట్లు నష్టాల్లో ఉండగా.., నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 10 పాయింట్ల స్వల్ప లాభంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ప్రధానంగా అమెరికా వడ్డీ రేట్లపై చేసిన కీలక వ్యాఖ్యలతో బాండ్ మార్కెట్లలో కోలాహలం మెుదలైంది. రిస్క్ లేకుండా అధిక రిటర్స్ వస్తున్నందున విదేశీ మదుపరులు తమ సంపదను ఈక్విటీ పెట్టుబడుల నుంచి క్రమంగా తరలిస్తున్నారు. దీంతో భారత మార్కెట్లో గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడి పెరిగిపోతోంది. సెప్టెంబర్ మాసంలో ఎఫ్ఐఐలు ఏకంగా 1.6 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు డేటా వెల్లడిస్తోంది. జనవరి తర్వాత అత్యధిక పెట్టుబడి ఉపసంహరణగా ఇది నిలిచింది.
ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎల్ టిఐఎమ్, సన్ ఫార్మా, ఎల్ టి, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో టాటా స్టీల్,టెక్ మహీంద్రా, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎయిర్ టెల్, యూపీఎల్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ కంపెనీల షేర్ల నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications