Stock Markets: బడ్జెట్ ప్రసంగం తర్వాత బుల్స్ తిరిగి దలాల్ స్ట్రీట్ లో తమ పరుగుపందెం మెుదలుపెట్టారు. ఈ క్రమంలో బెంచ్ మార్కెట్ సూచీలు రాకెట్ వేగంతో పెరుగుతూ ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తున్నాయి.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1312 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 420 పాయింట్లకు పైగా లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 437 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1042 పాయింట్ల పెరిగింది. ఈ క్రమంలో ఐటీ, మెటల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు మార్కెట్లను ర్యాలీకి పురిగొల్పాయి. నిఫ్టీ హెల్త్‌కేర్ సైతం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ప్రతికూలంగా ట్రేడవుతున్న ఏకైక ఇండెక్స్‌గా నిలిచింది.

ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1-2 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. 2024లో ఇప్పటి వరకు మిడ్ క్యాప్ సూచీ 24 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 25 శాతం రాబడిని అందించాయి. ఎన్నికలు, బడ్జెట్, USలో దిద్దుబాటుకు సంబంధించిన ఆందోళనలను మార్కెట్ తోసిపుచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ వెల్లడించారు.
ఈ క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications