Stock Market: సరికొత్త రికార్డుతో సెన్సెక్స్ ర్యాలీ.. బ్యాంకింగ్ షేర్లలో మెుదలైన అలజడి..
Sensex Record High: కొత్తవారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ఆరంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ తన సరికొత్త రికార్డు గరిష్ఠమైన 74,594.79 మార్కును ఇంట్రాడేలో అందుకుంది.
ఉదయం 9.33 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 327 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 93 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ స్వల్పంగా 27 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 184 పాయింట్ల లాభంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, బీపీసీఎల్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, ఎల్ టి, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, విప్రో, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో నేడు కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications