Stock Market Opening: వరుస నష్టాల నుంచి ఇన్వెస్టర్లకు కొంత ఊరట లభించింది. నిన్న 1000 పాయింట్లు కోల్పోయింది. అయితే నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియటంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఉదయం గ్యాప్ అప్ లో ప్రారంభం కావటం కూడా దీనినే నిర్ధారించింది.

తక్కువ ధరకు కొనుగోలు..
గత నాలుగు రోజులుగా మార్కెట్లు వరుసగా పతనం కావటంతో అనేక మంది ఇన్వెస్టర్లు కనిష్ఠాల వద్ద ఇన్వెస్ట్ చేసేందుకు మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు తేరుకుని సానుకూలంగా మారటంతో మదుపరులు కొనుగోళ్లవైపు మెుగ్గు చూపుతున్నారు.

లాభాల్లో సూచీలు..
ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 10 గంటల సమయంలో స్వల్ప లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 183 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 211 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 325 పాయింట్ల లాభంలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి.

గెయినర్స్..
మార్కెట్లో ప్రస్తుతం సూపర్ లాభాలతో బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్, ఐటీసీ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, బీపీసీఎస్, ఇండస్ ఇండ్ వంటి కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

లూజర్స్..
హీరోమోటో కార్ప్, అదానీ పోర్స్, మారుతీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కొ, బజాజ్ ఆటో, టైటాన్, కోల్ ఇండియా, యూపీఎల్, జేఎస్డబ్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, దివీల్ ల్యాబ్, ఎల్ అండ్ టీ వంటి కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications