Stock Market: సూపర్ లాభాల్లో సూచీలు.. వారాంతంలో అమెరికా చల్లని కబురు..
Stock Market: వరుస నష్టాలతో ఈ వారం మదుపరుల సంపదను ఆవిరి చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. భారత మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా ఆరంభంలో 1000 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది.ఈ క్రమంలో ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, మైండ్ ట్రీ షేర్లు ఎక్కువగా ఫోకస్ లో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు నిన్న 1000 పాయింట్లకు పైగా లాభాలతో ముగిశాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. అమెరికాలో వార్షిక ప్రాతిపదికన ద్రవ్యోల్బణం తగ్గటంతో అగ్రరాజ్యానికి ఊరట లభించింది. ఇది ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటను అందించింది. అయితే.. ద్రవ్యోల్బణం సెప్టెంబర్ మాసంలో కొంత పెరిగింది.

ఉదయం 9.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 282 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ 1028 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 798 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 375 పాయింట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్ టీ, యూపీఎల్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ గా నిలుస్తున్నాయి. ఈ సమయంలో సూచీలోని ఒక్క కంపెనీ కూడా నష్టాల్లో లేకపోవటం గమనార్హం.


Click it and Unblock the Notifications