Stock Market: దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ దూకుడు.. ప్రారంభంలో శుభ సూచీలు..
Stock Market: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి దూకుడుతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బుల్ జోరు కొనసాగుతోంది. గత నెలలో మార్కెట్ల పతనం నుంచి ఇన్వెస్టర్లు సైతం కోలుకుంటున్నారు.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 153 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 287 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 195 పాయింట్ల లాభం ట్రేడవుతున్నాయి.

కీలక విషయాలు..
కేంద్ర ప్రభుత్వం డీజిల్, విమాన ఇంధనంపై విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గించింది. ఈ క్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలతో పాటు ఐటీ రంగంలోని కంపెనీలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఇదే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ కంపెనీలు లాభాల్లో కొనసాగుతూ మార్కెట్లకు ఊతం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్స్ సైతం నేటి నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా కన్జ్యూమర్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమయంలో సూచీలో బ్రిటానియా, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్ కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications