Stock Market: లాభాల్లో మెుదలైన Sensex, Nifty.. గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో..
Stock Market: నిన్న భారీ నష్టాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో తిరిగి లాభాల బాట పట్టాయి. అయితే ప్రీ ఓపెనింగ్ మార్కెట్లో ఫ్లాట్ ట్రేడింగ్ నమోదు చేశాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ ఇదే సమయంలో 92 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 233 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 259 పాయింట్ల లాభాలతో ఇంట్రాడేలో ముందుకు కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల మధ్య మార్కెట్లు ఈ వారాన్ని నిస్సత్తువగా ప్రారంభించగా ప్రభుత్వ బ్యాంకులు, మీడియా కంపెనీలు నిరాశాజనకమైన పనితీరును కనబరిచాయి.

ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, మారుతీ, హిందాల్కొ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో నిలిచాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, సిప్లా వంటి స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications