Stock Market: లాభాలు చూపించి నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. ఎందుకిలా..??
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రీ-ఓపెనింగ్ సెషన్లో లాభాలను నమోదు చేశాయి. అయితే వాస్తవానికి మార్కెట్లు తెరుచుకోగానే నేడు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.ఈ క్రమంలో రిలయన్స్ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ కనిపిస్తోంది.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 228 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 222 పాయింట్ల మేర కోల్పోయింది. మార్కెట్లు ఆరంభం నుంచే నేడు భారీగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

అసలు మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల బాట పట్టడానికి అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం విషయంలో భౌగోళిక రాజకీయ ప్రమాదాల ప్రతికూలతలు కొనసాగుతున్నాయి. ఇవి మరింతగా దిగజారే అవకాశం ఉన్నందున చాలా మంది మార్కెట్ నిపుణులు వేచి చూసే ధోరణిని సరైన మార్గంగా నమ్ముతున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లు భారీగా ప్రభావానికి లోనవుతున్నాయి. కొత్త పెట్టుబడులపై ఇన్వెస్టర్లు అప్రమత్తతగా వ్యవహరిస్తున్నారు.
ఎన్ఎస్ఈలో సిప్లా, బీపీసీఎల్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఎస్పీఐ లైఫ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, విప్రో, టెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, గ్రాసిమ్, టైటాన్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్, హెచ్ యుఎల్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, టాటా స్టీల్, ఎల్ టి, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications