Stock Market: వారాంతంలో చతికిలపడ్డ మార్కెట్లు.. భారీ నష్టాల్లో ఐటీ షేర్లు.. GDP తెచ్చిన తంట..
Stock Market: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రధాన సూచీలు ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. భారత జీడీపీ వృద్ధిపై ఫిచ్ రెటింగ్ సంస్థ ఇచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మందగమనం కొనసాగుతుందని తెలియటంతో మదుపరులు అమ్మకాలకు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు.

దిగజారిన సూచీలు..
ఉదయం 10.05 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ 700 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 272 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 280 పాయింట్లు కోల్పోయి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

అమెరికా మార్కెట్ల ప్రభావం..
యూఎస్ లో ద్రవ్యోల్బణం భారీగా ఉండటంతో అక్కడి మార్కెట్ల నుంచి చైనా పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం కారణంగా వాల్ స్ట్రీస్ భారీ నష్టాలను నమోదుచేసినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ కూడా గడ్డుకాలాన్ని ఎదుర్కోవటం వల్ల ఆసియా మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఫెడ్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ రానున్న కాలంలో మళ్లీ వడ్డీ రేట్లను భారీగా పెంచుతాయనే భయాలతో ఇన్వెస్టర్లు తమ డబ్బును ఈక్విటీ నుంచి బయటకు తరలిస్తున్నారు.

గెయినర్స్ అండ్ లూజర్స్.. .
ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, సన్ ఫార్మా కంపెనీలు మాత్రమే ఆరంభంలో లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, టాటా మోటార్స్, బీపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications