Stock Market: గత వారం మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మళ్లీ నేడు తిరోగమనం బాటలో నడుస్తున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల పవనాలతో ఇన్వెస్టర్లు లాభాల బుక్కింగ్ వైపు మెుగ్గుచూపుతున్నారు. దీంతో మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.

మార్కెట్ సూచీలు..
ప్రధాన సూచీ నెన్సెక్స్ ఉదయం 9.32 గంటల సమయంలో 253 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 80 పాయింట్ల మేర నష్టాల్లో ఉంది. మరో సూచీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలతో ప్రరంభమైనప్పటికీ.. 93 పాయింట్ల నష్టంలో ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ మాత్రం 310 పాయింట్ల నష్టంలో సాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు..
అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరుకోవటం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెడుతోంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లను మరింత పెంచాలని సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కూడా మరింత పదునైన వడ్డీ రేట్ల పెంపుదల గురించి సూచన చేశారు.
అయితే మాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్ సూచీ నాస్‌డాక్ 3.08 శాతం మేర క్షీణించింది. ఇదే సమయంలో యూరోపియన్ మార్కెట్లు పుంజుకున్నాయి.

టాప్ గెయినర్స్..
బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హీరో మోటొకార్ప్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్ కంపెనీలు మాత్రం టాప్ గెయినర్స్ గా నిలుస్తూ లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్..
మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్,ఓఎన్జీసీ, బ్రిటానియా, కోల్ ఇండియా, విప్రో స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications