Stock Market: నష్టాల్లో కీలక సూచీలు.. ఐటీ స్టాక్స్ బేజారుతో మార్కెట్స్ డౌన్..
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా ఐటీ, మెటల్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు భారీగా చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఎఫ్ఎమ్సీజీ స్టాక్స్ ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. ఆటో షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 10.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 196 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 63 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం స్వల్పంగా 46 పాయింట్ల లాభంలో ఉంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 31 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

యూఎస్ మార్కెట్లలో..
ప్రధానంగా గత రెండు రోజులుగా అమెరిగా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ట్రెజరీ దిగుబడి పెరగడంతో ఈక్విటీ మార్కెట్‌పై ప్రభావం కనిపిస్తోంది. బుధవారం డౌ జోన్స్ 249.13 పాయింట్లు క్షీణించింది. S&P 500 ఇండెక్స్ 36 పాయింట్ల మేర నష్టపోయింది. ఫెడ్ ఛైర్మన్ రానున్న కాలంలో కూడా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందని ఇచ్చిన సంకేతాలతో మార్కెట్లు నష్టాలను నమోదుచేస్తున్నాయి. ఇదే క్రమంలో క్రూడ్ ధరలు సైతం స్వల్ప బలహీనతలో ఉన్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యూపీఎల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా కంపెనీలు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
హెచ్సీఎల్ టెక్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, గ్రాసిమ్, రిలయన్స్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టాటా మోటార్స్, ఓఎన్డీసీ, టైటాన్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications