Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఫెడ్ హెచ్చరికల నేపథ్యంలో ఆసియా మార్కెట్లలోని మదుపరులు, బాండ్ హోల్డర్లు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు.

జపాన్ పరిస్థితులు..
అంచనాలను తలకిందులు చేస్తున్న ద్రవ్యోల్బణం.. ఈ సారి అమెరికా, యూరప్ తర్వాత జపాన్ మార్కెట్లను ఆవరించింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా జపాన్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠాన్ని తాకింది. దీనికి తోడు డాలర్ దూకుడు తగ్గటంతో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ వేగంగా పెరుగుతోంది. రూపాయి విలువ సైతం కొంత మేర పతనం కానున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది.

మార్కెట్ సూచీలు..
ఆరంభంలో స్వల్ప లాభాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 77 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 31 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం స్వల్పంగా 64 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ సైతం 2 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈలోని కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్స్, ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స, యూపీఎల్ తో సహా మరిన్ని స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
గ్రాసిమ్, ఎం అండ్ ఎం, బ్రిటానియా, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, నెస్టిల్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, మారుతీ, అల్ట్రాటెక్, హెచ్సీఎల్ టెక్, హిందాల్కొ తో పాటు మరిన్ని స్టాక్స్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications