Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అంతా అమెరికా చలవే..ఎందుకంటే
Stock Market: ఒకపక్క క్యూ1 ఫలితాలు విడుదల అవుతుండగా.. మరోపక్క అమెరికా నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఐటీ కంపెనీ షేర్లు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.
ప్రారంభం నుంచి మార్కెట్ ర్యాలీ కొనసాగటంతో ఉదయం 9.24 గంటల సమయంలో.. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 186 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 57 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 219 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 132 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత విప్రో షేర్లు మార్కెట్లో లాభపడ్డాయి.

అమెరికాలో ద్రవ్యోల్బణం నెమ్మదిగా తగ్గటం ప్రపంచ దేశాలకు శుభవార్తగా మారింది. రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు స్వల్పంగానే ఉండవచ్చనే ఊహాగానాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గించటంతో చమురు ధరలు పెరగటం ప్రారంభించాయి.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎమ్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, యూపీఎల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, బ్రిటానియా, హీరో మోటార్స్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications