For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ఫెడ్ పావెల్ సంచలన ప్రకటన..

|

Stock Market: నిన్న నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇదే క్రమంలో అమెరికాల సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించటం.. ఎకనమిక్ డేటాను విడుదల చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో సూచీ నిఫ్టీ 15 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 9 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 74 పాయింట్ల ప్రాఫిట్ లో కొనసాగుతోంది.

 Stock Market

అమెరికా సెంట్రల్ బ్యాంక్ అనుకున్నంత పని చేసింది. ఈ సారి సమీక్షలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. తదుపరి చర్యలపై మాట్లాడిన ఫెడ్ ఛైర్మన్ పావెల్ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేంత వరకు వడ్డీ రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేట్ల తగ్గింపుకు సహకరించటం లేదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు మాత్రం తరువాత కుప్పకూలే బ్యాంక్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, టాటా స్టీల్, సిప్లా, టీసీఎస్, సన్ ఫార్మా, బ్రిటానియా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

ఇదే క్రమంలో సూచీలో పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

English summary

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ఫెడ్ పావెల్ సంచలన ప్రకటన.. | Indian stock markets in flat profits amid US Fed hiked interest rates by 25 basis points

Indian stock markets in flat profits amid US Fed hiked interest rates by 25 basis points
Story first published: Thursday, May 4, 2023, 9:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X