Market Opening: రక్షాబంధన్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. గతవారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు సోమవారం కూడా అదే జోష్ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అమెరికాలో మాంద్యం వచ్చే ప్రభావం, సూచనలు తగ్గినట్లు తాజా డేటా వెల్లడించటంతో ప్రపంచ మార్కెట్లు ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మేర లాభంలో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 116 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 160 పాయింట్ల మేర గెయిన్ అయ్యాయి. ఈ క్రమంలో అమెరికా మార్కెట్లు సానుకూలంగా లాభాల్లో క్లోజ్ కాగా, ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో ఓఎన్జీసీ, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు మార్కెట్లలో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టైటాన్, టాటా స్టీల్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, హిందాల్కొ, రిలయన్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications