Stock Market: ఫెడ్ మీటింగ్ దగ్గర పడుతున్న వేళ గ్లోబల్ మార్కెట్లు రేట్ల తగ్గింపుపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్ లో సైతం నేడు బుల్స్ తమ జోరు చూపించటంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను నేడు తాకాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 98 పాయింట్ల లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 215 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 226 పాయింట్ల పెరుగుదలను చూసింది. ఈ క్రమంలో నేడు పవర్ రంగానికి చెందిన కంపెనీ షేర్లు లాభాలతో మార్కెట్లను ముందుకు నడిపించగా.. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మార్కెట్ సూచీలను కిందకు లాగాయి. ప్రస్తుతం మార్కెట్లు జెరోమ్ పావెల్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రేపు మార్కెట్లలో ట్రేడర్ల అప్రమత్తత ఓలటాలిటీకి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్,గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, బీపీసీఎల్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, మారుతీ, టీసీఎస్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు నిలిచాయి.


Click it and Unblock the Notifications