Stock Market: పండుగ సెలవు తర్వాత ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు శుభారంభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో ఉదయం సూచీలు భారీ లాభాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. నెలాఖరు కావటంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి నేడు చివరి రోజు కావటం విశేషం.
ఉదయం 9.19 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 616 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 175 పాయింట్ల లాభంలో ఉంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 455 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 217 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లను ప్రభవితం చేస్తున్నాయని తెలుస్తోంది. మెుదటి ట్రేడింగ్ సెషన్లో నేడు మార్కెట్లు మంచి దూకుడును ప్రదర్శించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2023లో అమెరికా జీడీపీ అంచనాలను చూస్తుంటే మాంద్యం ప్రభావం కొనసాగవచ్చని సూచిస్తున్నాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం కోసం డాట్ ప్లాట్లు, ఫెడ్ అంచనాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి జీడీపీ అంచనాలను ఫెడ్ 0.4 శాతానికి తగ్గించుకుంది. ఉత్పాదకతలో గణనీయమైన పతనం కారణంగా రానున్న మూడు త్రైమాసికాల్లో ప్రతికూల వృద్ధి ఉండవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
NSEలో రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే, ఓఎన్జీసీ, హిందాల్కొ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఈ క్రమంలో సూచీలో ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐటీసీ, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్ స్టాక్స్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications