Stock Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లలో పండుగ కోలాహలం కనిపించింది. ఉదయం ఆరంభంలోనే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,100 పాయింట్లు లాభపడింది. ఇదే సమయంలో నిఫ్టీ 17,200 పాయింట్ల మార్క్ దాటింది. దీంతో అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆరంభంలో..
మార్కెట్ల ప్రీ ఓపెన్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 600 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల గ్యాప్ అప్ తో ప్రారంభమయ్యాయి. ఆ జోరు అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 1036 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 302 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 956 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 425 పాయింట్ల మేర లాభపడ్డాయి.

ప్రధాన కారణాలు..
బ్రిటన్ లో అధిక ఆదాయాలు ఆర్జించే సంపన్నులకు భారీగా పన్ను తగ్గించేందుకు ఉద్దేశించిన విధానాన్ని అక్కడి ప్రభుత్వం ఉపసమహరించుకుంది. దీనిపై గతవారం ఐఎంఎఫ్ కూడా స్పందిస్తూ.. ఇది సమాజంలో అంతరాయాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించింది. దీనికి తోడు ఆసియా పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా ఉండటం కలిసొచ్చిన అంశాలుగా చెప్పుకోవాలి.

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, జేఎస్డబ్యూ తో పాటు ఇతర స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అయితే ఇదే సమయంలో కేవలం డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉంటూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications