Market Opening: వరుస నష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్రేక్ పడింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం దీనికి కారణంగా నిలిచింది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 87 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 220 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 278 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పతనం, యూఎస్ ట్రెజరీ దిగుబడుల్లో నెలకొన్న కొంత స్థిరత్వం ట్రేడర్లను కొంత ఊపిరిపీల్చుకోనిస్తున్నాయి. దీనికి తోడు ఆసియా, అమెరికా మార్కెట్లు రికవరీ కారణంగా సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. దీంతో నేడు ప్రారంభ ట్రేడ్‌లలో మార్కెట్లు స్థిరమైన లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారులను క్రమంగా లాభాల స్వీకరణవైపు నడిపిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
NSEలో ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, విప్రో, అల్ట్రాటెస్ సిమెంట్స్, హీరో మోటార్స్, టాటా స్టీల్, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, అదానీ పోర్ట్స్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, బ్రిటానియా, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications