Stock Market: మార్కెట్లలో చంద్రయాన్ సక్సెస్ జోష్.. భారీ లాభాల్లో ప్రారంభం..
Stock Market: చంద్రయాన్-3 విజయం లిఖించిన సువర్ణాక్షరాలు మార్కెట్లలో కొత్త జోష్ నింపాయి. దీంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 245 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 75 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 163 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 300 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా మార్కెట్లు నిన్న భారీ లాభాలతో ముగియటం సానుకూల ప్రభావాన్ని మరింతగా బలపరిచింది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎల్ టి, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. చంద్రయాన్ విజయవంతంగా పూర్తి కావటంపై దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఆనందర్ మహీంద్రా, గౌతమ్ అదానీ, గౌతమ్ సంఘ్వీ, రిలయన్స్ ఫౌండేషన్స్ ఇస్రోను అభినందిస్తూ సామాజిక మాద్యమాల్లో సందేశాలు పంపాయి.


Click it and Unblock the Notifications