Stock Market: నెల చివరి వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. వరుసగా ఆరో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారుల మెుత్తం సంపద దాదాపు రూ.20 లక్షల కోట్ల మేర తరిగిపోయింది.
ఉదయం నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ లను మూట కట్టుకున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లు మిడ్ డే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 900 పాయింట్లు పడిపోవడంతో ఇంట్రాడేలో భారీ క్షీణతను చవిచూశాయి. దీంతో జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ జూన్ 28 తర్వాత తొలిసారిగా నేడు 18,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈరోజు స్టాక్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించిందన చెప్పుకోవాలి.

అసలు ఇంత భారీగా మార్కెట్లు పతనం కావటానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. ముందుగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆందోళనలను పెంచేస్తోంది. దీంతో పాటు యూఎస్ బాండ్స్ ఈల్డ్‌లపై ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 783 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ 241 పాయింట్లు క్షీణించింది.
ఇంట్రాడేలో ఒకానొక దశలో సెన్సెక్స్ సూచీ దాదాపు 930 పాయింట్ల మేర నష్టాలను తాకింది. అయితే తర్వాత తిరిగి కోలుకుంది. అయితే ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దాదాపు 7 శాతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే రూ.5.8 లక్షల కోట్లు మేర సంపదను కోల్పోయారు. బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304.44 లక్షల కోట్లకు క్షీణించింది. ప్రస్తుతం మార్కెట్లు పూర్తిగా బేర్స్ చేతిలో నష్టాల ఊబిలో కొనసాగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications