Stock Market: వరుస సెలవుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ప్రీఓపెన్ మార్కెట్లోనే కీలక సూచీలు నేలకూలాయి. ప్రధాన సూచీలు బేరిష్ ప్రారంభంతో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 112 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 227 పాయింట్లు నష్టాల్లో ఇంట్రాడేలో కొనసాగుతుండగా.. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 351 పాయింట్లను కోల్పోయి ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ప్రధానంగా యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ముగియటం.. జపాన్ గణాంకాల రాకకోసం ఎదురుచూస్తున్న ఆసియా మార్కెట్లలోని ఇన్వెస్టర్ల కారణంగా నష్టాల్లో అక్కడి మార్కెట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు నష్టాలను మరింతగా కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, ఎన్టపీసీ, కోల్ ఇండియా కంపెనీలు మాత్రమే లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, సిప్లా, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications