Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తీవ్ర ఒడిదొడుకుల్లో పయనం..
Stock Market: నిన్న ట్రేడింగ్ చివరి గంటల్లో లభించిన కొనుగోళ్ల సపోర్ట్ నేడు మార్కెట్ల ఆరంభంలోనూ కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల మేర లాభపడింది. అయితే కొద్ది సేపటికే అది ఆవిరైంది.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 143 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 61 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.

NSE సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, యూపీఎల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో సూచీలోని డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, గ్రాసిమ్, సిప్లా, నెస్లే, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, మారుతీ, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications