Stock Market: బౌన్స్ బ్యాక్ అయిన మార్కెట్లు.. లాభాల్లో యూఎస్, ఏషియన్ మార్కెట్స్..
Opening Bell: నిన్న భారీ ఒడిదొడుకులతో ఫ్లాట్ ముగింపును చూసిన మార్కెట్లు నేడు తిరిగి పుంజుకున్నాయి. నేడు ఆసియా మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటంతో భారత మార్కెట్లు లాభాల్లోకి వస్తున్నాయి.
ఉదయం 9.29 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 52 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 82 పాయింట్ల గెయిన కాగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 138 పాయింట్ల లాభాలతో ముందుకు సాగుతున్నాయి. నిన్న గరిష్ఠాలకు చేరిన జొమాటో స్టాక్ నేను బ్లాక్ డీల్ తర్వాత పతనాన్ని చూశాయి.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, హీరో మోటార్స్, హిందాల్కొ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, ఎల్ టి, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications