Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. దాదాపు రెండు రోజులుగా క్షీణిస్తున్న మార్కెట్లు నేడు పుంజుకున్నాయు. అమెరికా మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూలతలే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 149 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 417 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 342 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఇదే క్రమంలో బ్రిటానియా, టాటా స్టీల్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు మార్కెట్లలో ప్రధానంగా ఫోకస్‌లో ఉన్నాయి.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ శుభవార్త చెప్పారు. కీలక వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. వడ్డీ రేట్ల పెంపు దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు వెల్లడించాయి. ఇదే క్రమంలో ఆర్థిక వృద్ధిపై సానుకూలతలను వ్యక్తం చేయటాన్ని మార్కెట్లు స్వాగతించాయి. దీంతో యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. ప్రపంచ మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. ఈ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది.
ఎన్ఎస్ఈలో బ్రిటానియా, ఎల్‌టిఐఎమ్, హిందాల్కొ, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, విప్రో, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, రిలయన్స్, నెస్లే కంపెనీల షేర్లు లాభాలకతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో సూచీలోని టాటా స్టీల్ మాత్రం నష్టాలతో ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications