Stock Market: గ్లోబల్ మార్కెట్ల దారిలో సెన్సెక్స్, నిఫ్టీ.. కొనసాగుతున్న ఒడిదొడుకులు..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలను నేడు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లను దేశీయ సూచీలు అనుకరిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగించాయి.
ఉదయం 9.25 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ఫ్లాట్ ఆరంభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 45 పాయింట్ల నష్టంతో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 36 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, గ్రాసిమ్, నెస్లే, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఐటీసీ, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, యూపీఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, ఎస్బీఐ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications