Market Opening: వరుస సెలవుల తర్వాత కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. అమెరికా ఆసియా మార్కెట్ల ప్రభావంతో ప్రీఓపెన్ సెషన్లోనూ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 323 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 231 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 122 పాయింట్ల మేర నష్టాల్లో ఇంట్రాడేలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మార్కెట్లలో ఓలటాలిటీ అధికంగా కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, మారుతీ, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఎయిర్ టెల్, ఐటీసీ, యూపీఎల్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications