Stock Markets: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత నమోదైన అమ్మకాల ఒత్తిడితో చిత్తయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీలు ఊహించని రీతిలో నష్టాలను చవిచూశాయి.
ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1650 పాయింట్లకు పైగా నష్టపోగా మరో కీలక సూచీ నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాలను నమోదు చేసింది. ఇదే క్రమంలో ఇతర కీలక సూచీలు సైతం ఊహించని నష్టాలతో ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల నష్టాన్ని కలిగించాయి. పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం ప్రధానంగా అమ్మకాలకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫ్రంట్‌లైన్ బ్యాంకులు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్ నిఫ్టీ, సెన్సెక్స్‌లపై పెరిగిన ఒత్తిడితో భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు జనవరి 23 మధ్యాహ్నం వరకు పతనాన్ని పొడిగించాయి. ఆసియా మార్కెట్ల నుంచి తగ్గిన సంకేతాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. నేడు మార్కెట్లో జీ స్టాక్ 32 శాతానికి పైగా నష్టపోగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకదారులుగా నిలిచారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1028 పాయింట్లు నష్టపోగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 330 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 1052 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1471 పాయింట్ల భారీ నష్టాలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
NSEలో సిప్లా, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముగిశాయి. ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనీలివర్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications