Stock Market: అగాథంలోకి భారత స్టాక్ మార్కెట్లు.. సూచీలపై సునామీలా ఫెడ్ దెబ్బ..
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు పండుగ తర్వాత ఎరుపెక్కాయి. ఆరంభం నుంచే నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. దీంతో అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 280 పాయింట్లను కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 209 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సైతం 110 పాయింట్లు నష్టపోయింది.

కేవలం భారత మార్కెట్లపై మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లపై కూడా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం కనిపిస్తోంది. ఒక పక్క అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్ల పెంపుతో మార్కెట్లలో మనీ సర్క్యులేషన్ తగ్గించేందుకు సెంట్రల్ బ్యాంకులు చేపడుతున్న మానిటరీ పాలసీతో పరిస్థితులు వికటించి లిక్విడిటీ క్రంచ్ కి కారణంగా మారటంతో బ్యాంకింగ్ సంక్షోభం మెుదలైంది. ఇలాంటి సందర్భంలోనూ పావెల్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు.
NSE సూచీలోని ఎల్ టి, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, సిప్లా, టాటా మోటార్స్, టాటా స్టీల్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్ స్టాక్స్ మాత్రం లాభాల్లో కొనసాగుతూ ఆరంభంలో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, కోల్ ఇండియా, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications