Market Closing: ఇంట్రాడేలో ఆవిరైన లాభాలు.. ఫ్లాట్‌గా ముగిసిన Sensex-Nifty..
Closing Bell: ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో ఒడిదొడుకుల తర్వాత ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ప్రధానంగా రిజర్వు బ్యాంక్ డ్రాఫ్ట్ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్పా లాభంలో నిలిచింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ మాత్రం 33 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 28 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 273 పాయింట్లను కోల్పోయాయి. ముగింపు సమయంలో నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 2.76 శాతం పెరిగింది. ఇదే క్రమంలో నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 3.66 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.55 శాతం, ఆయిల్ & గ్యాస్ సూచీ 1.75 శాతం నష్టపోయాయి.

NSEలో బ్రిటానియా, కోటక్ బ్యాంక్, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, హిందాల్కొ, గ్రాసిమ్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications