Stock Market: స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్.. భారత మార్కెట్లకు యూరప్ కష్టాలు..!
Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో తమ ప్రయాణాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. అయితే సమయం గడిచే కొద్ది లాభాల్లోకి చేరుకున్నాయి. అమెరికా బ్యాంకుల తర్వాత క్రెడిట్ సూయిస్ షేర్లు పతనం కావటం ఆందోళనలకు దారితీసింది.

మార్కెట్ సూచీలు..
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ సూచీ 13 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 81 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 26 పాయింట్ల స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్లలో అనిశ్చితులు మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ క్రైసిస్ కారణంగా ఇన్వెస్టర్లు భయాలకు లోనవుతున్నందున నేడు ఆసియా మార్కెట్లు క్షీణించాయి.

దెబ్బతిన్న రంగాలు..
ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాలు కనిపించగా, ఫార్మా, ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. 13 ప్రధాన రంగాల సూచీల్లో 8 నష్టల్లో ముగిశాయి. ఆర్థిక మందగమనం భయంతో నిఫ్టీ మెటల్ దాదాపు 3 శాతం పడిపోయింది. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ టాప్ లూజర్‌గా ఉన్నాయి.

బలంగా ఎఫ్‌ఎంసీజీ..
మార్కెట్ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన స్టాక్స్ ఈరోజు లాభాలను నమోదు చేశాయి. ఈ స్టాక్స్ 8 శాతం వరకు పెరిగాయి. ఇందులో నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇదే సమయంలో ఏషియన్ పెయింట్స్, టైటాన్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్, ఐటీసీ, సన్ ఫార్మా, ఎల్‌టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కూడా బుల్లిష్‌గా నిలిచాయి.


Click it and Unblock the Notifications