Stock Market Crash: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు..
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై.. భారీ నష్టాలతో ముగిశాయి. కీలక సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రధానంగా ఆటో, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో ఐటీ, రియల్టీ, మెటల్ రంగాలు మాత్రం తీవ్రమైన నష్టాలను నమోదు చేశాయి.

కుప్పకూలిన సూచీలు..
ఉదయం నుంచి స్వల్ప నష్టాలతో కొనసాగిన సూచీ.. సమయం గడుస్తున్న కొద్ది నష్టాల్లోకి జారుకుంది. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే నాటికి ప్రధాన సూచీ సెన్సెక్స్ 844 పాయింట్లను కోల్పోయింది. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 257 పాయింట్లను కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 380 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 541 పాయింట్లను కోల్పోయింది.

అమెరికా మార్కెట్లు కుదేలు..
సోమవారం యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ముగియటం దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావాన్నే చూపింది. దీంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లలోని ఇతర సూచీలు సైతం నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రరంభమైనప్పటికీ.. విదేశి ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించటంతో పరిస్థితి దిగజారింది. అలా అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్న మార్కెట్లపై బేర్ పంజా కొనసాగింది.

టాప్ గెయినర్స్..
దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాలను నమోదు చేసినప్పటికీ.. నిఫ్టీ సూచీలోని యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు మార్కెట్లు ముగిసే సమయానికి లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్..
మార్కెట్ క్లోజింగ్ నాటికి దివీస్ ల్యాబొరేటరీస్, జేఎస్డబ్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ తో పాటు ఇతర కంపెనీలు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications