Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం చివరి రోజు ట్రేడింగ్ లాభాలతో ముగించాయి. వారం ప్రారంభంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఆ తర్వాత బుల్స్ మళ్లీ తమ జోరును కొనసాగించారు.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 52 పాయింట్లు గెయిన్ అయ్యింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 37 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 87 పాయింట్ల మేర లాభంతో ఈ వారాన్నిముగించాయి. నేడు మార్కెట్ల పాజిటివ్ ర్యాలీకి ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్ల లాభాలు నడిపించాయి.

ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, ఎల్ టి, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఓఎన్టీసీ, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బ్రిటానియా, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, యూపీఎల్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కొ, టాటా కన్జూమర్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications