Stock Market: అలా లాభాలు ఇలా నష్టాలు.. కరోనా బూచి కలకలం.. తేరుకునే లోపే ఆవిరి..
Stock Market: ఉదయం ఆరంభంలో సూచీలు లాభాలతో మెుదలయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 99 పాయింట్ల లాభంతో మెుదలైంది. అయితే కేవలం కొద్ది నిమిషాల్లోనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగియటం అంతర్జాతీయ మార్కెట్లకు ఊరటగా నిలిచినప్పటికే పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్లలో ఆందోళనను భారీగా పెంచుతున్నాయి.
ఉదయం 11.32 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 258 పాయింట్లు, నిఫ్టీ సూచీ 82 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 207 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 370 పాయింట్ల మేర నష్టపోయాయి. మార్కెట్ల ఒడిదొడుకున్న ఎక్స్ఛేంజీల్లోకి అడుగుపెట్టిన సులవైన్ యార్డ్స్ ఐపీవో ధర కంటే తక్కువకు లిస్టింగ్ జరిగింది. మార్కెట్లో స్టాక్ రూ.361 రేటుకు లిస్ట్ అయ్యింది.

ఎన్ఎస్ఈ సూచీలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఇదే సమయంలో టాటా మోటార్స్, యూపీఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఎస్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కొ, ఎల్ అండ్ టీ, ఐటీసీతో పాటు మరిన్ని కంపెనీ ఈ క్రమంలో నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications