Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తమ ప్రయాణాన్ని లాభదాయకంగా మెుదలుపెట్టాయి. వాస్తవానికి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో దేశీయ సూచీల్లో ఓలటాలిటీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి సెన్సెక్స్-నిఫ్టీ.
ఉదయం 9.33 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ లాభాలు ఆవిరై 5 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం లాభాల్లోంచి 21 పాయింట్ల నష్టంలోకి జారుకుంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 14 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. చివరికి నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ లాభాల్లోంచి 100 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. మార్కెట్ల పనితీరు గమనిస్తుంటే నష్టాల్లోకి జారుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే షేర్లలో కొంత సానుకూల జంప్ కనిపించింది.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎల్ టి, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, టైటాన్, విప్రో, టాటా కన్జూమర్, మారుతీ, హిందాల్కొ, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాల్లో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications