Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు అకస్మాత్తుగా నేడు నష్టాల బాటపట్టాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలను సూచీలు మూటకట్టుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లను కోల్పోయాయి. మార్కెట్ నిపుణుల క్యూ2 ఫలితాల ఆదాయాల మార్జిన్లు కార్పొరేట్ కంపెనీలపై ప్రతికూలంగా ఉంటుందని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి.

నేడు మార్కెట్లలో బ్యాంకింగ్, పవర్ రంగాల్లోని కంపెనీలు మార్కెట్లను నష్టాలోకి లాగాయి. ఇదే క్రమంలో ఫార్మా స్టాక్స్ లాభాల పంట పండించాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
ఎన్ఎస్ఈలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, మారుతీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications