Market Crash: మండే స్టాక్ మార్కెట్స్ ఢమాల్.. భారీ నష్టాలతో సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్..
Monday Market Fall: నెల చివరి రోజును, వారం మెుదటి రోజును దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభించాయి. గడచిన వారంలో రంకెలు వేస్తూ పైపైకి ఎగబాకిన కీలక బెంచ్ మార్క్ సూచీలు నేడు మాత్రం బేజారాయి. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాలు నేడు భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తున్నాయని చెప్పుకోవచ్చు.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 393 పాయింట్ల నష్టంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 111 పాయింట్ల నష్టాన్ని చూసింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ బ్యాంక్ 322 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 302 పాయింట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సూచీలు మరింతగా నష్టాల్లోకి జారుకుంటూ బేర్ పంజాలో చిక్కుకున్నాయి. అయితే గ్లోబల్ క్యూస్ బలహీనంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో గిఫ్ట్ నిఫ్టీ సూచీ సైతం ఉదయం నష్టాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.

NSEలో హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టైటాన్, ఎన్టీపీసీ, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, కోల్ ఇండియా, బీఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, మారుతీ, సిప్లా, బజాజా ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ ఇన్ ఫోకస్..
దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మహానగర్ గ్యాస్ లిమిటెడ్‌లో తన వాటాను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారిక కమ్యూనికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడైంది. ఈ క్రమంలో ఎల్ఐసీ మహానగర్ గ్యాస్‌లో తన ఈక్విటీ షేర్ హోల్డింగ్ ను 89,19,236 షేర్ల నుంచి 68,54,264 షేర్లకు తగ్గించింది. మహానగర్ గ్యాస్ షేరు ధర ఈ ఏడాది ఇప్పటి వరకు 85 శాతం పెరిగింది. అలాగే గ్యాస్ స్టాక్ ధర ఒక నెల వ్యవధిలో 7 శాతానికి పైగా పెరిగింది. BSE ప్రకారం సెప్టెంబర్ 30న ఉదయం 9:44 గంటలకు మహానగర్ గ్యాస్ షేర్ ధర 1.42 శాతం క్షీణించి ఒక్కోటి రూ.1,919.75 వద్ద ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications