Market Fall: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లోకి జారుకుని ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. అన్ని రంగాల షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో నేడు మార్కెట్లు ఇంట్రాడేలో చిత్తు అయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సీజీ మినహా అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ట్రేడింగ్ మధ్యాహ్నం సమయానికి బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.8 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.6 శాతం క్షీణతను చూశాయి. ఇదే క్రమంలో ఓలటాలిటీని సూచించి ఇండియా విక్స్ 4 శాతం పెరిగి 17 శాతానికి చేరుకోవటం కొంత ఆందోళనను కలిగిస్తోంది. ఏప్రిల్ 23 తర్వాత ఇది భారీగా పెరగటానికి రెండు కారణాలు ఉన్నాయి. మెుదటగా.. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ హోల్డింగ్‌లను కాపాడుకోవడానికి ప్రొటెక్టివ్ పుట్ ఆప్షన్‌లను కొనుగోలు చేస్తున్నారు. రెండవది మార్కెట్లో ట్రేడర్లు కాల్స్, పుట్ ఆప్షన్‌లు రెండింటినీ కొనుగోలు చేయడం ద్వారా ఎన్నికల తర్వాత మార్కట్లపై భారీగా బెట్టింగ్ వేస్తున్నారు.

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ కంపెనీల షేర్లు భారీ లాభాలను నమోదు చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తులకు డిమాండ్ తిరిగి పుంజుకుంటున్న వేళ ఎఫ్‌ఎంసీజీ రంగం చుట్టూ ఉన్న సానుకూల నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగంలోని కంపెనీల షేర్లపై ప్రస్తుతం బెట్టింగ్ వేస్తున్నారు.
మధ్యాహ్నం 12.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 453 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 149 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 575 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 887 పాయింట్లను నష్టపోయాయి. నిఫ్టీ ప్రస్తుతం 22,300కంటే కింద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ సమయంలో పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications